Posted on 2025-08-06 15:02:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘo ఆధ్వర్యంలో స్థానిక కంటేశ్వర్ లో గల జయ శంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్టేట్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వడ్ల హన్మాండ్లు చారి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరంతరం కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ అని, వారి ఆశయ సాధనను ఆదర్శంగా తీసుకోవాలనీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంకు నీళ్ళు,నిధులు, నియామకాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధిలో తీవ్ర అన్యాయం జరుగుతుందని,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితేనే,మన నీళ్ళు, నిధులు, నియామకాలు మనకు ధక్కుతాయన్న సంకల్పంతో విద్యార్థి దశనుండి తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై బాల్యదశ నుండి వృద్ధాప్యం వరకు నిరంతరం శ్రమించిన గొప్ప మహానుభావులు ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ అని,విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించిన బీసీ ముద్దు బిడ్డ జయశంకర్ సార్,తెలంగాణకే,బీసీ కులానికే,విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణం అన్నారు.
కార్యక్రమంలో స్టేట్ క్యాషియర్ తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి బంధన కంటి నరసింహులు, నరసింహ చారి,కట్ల సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >