| Daily భారత్
Logo




చేనేత రంగానికి రేవంత్ సర్కార్ చేయూతనివ్వాలి

News

Posted on 2025-08-07 12:47:37

Share: Share


చేనేత రంగానికి రేవంత్ సర్కార్ చేయూతనివ్వాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం  ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతు ‘‘నరాలను పోగులుగా చేసి..తమ రక్తాన్ని రంగులుగా అద్ది.. గుండెలను కండెలుగా మార్చి..చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. పేగులను వస్త్రాలుగా అందించి..మనిషికి నాగరికతను అందించిన.. ఘనత చేనేత కార్మికులది అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి అహింసా ఉద్యమానికి నాంది పలికింది చేనేత రంగం అన్నారు. ఆనాడు విదేశీ వస్త్రాల బహిష్కరించాలనే లక్ష్యంతో స్వదేశీ ఉద్యమాన్ని ఉదృతం చేయడంలో కీలక పాత్ర వహించరాని అన్నారు.1905 ఆగస్టు 7న విదేశీ వస్తువుల బహిష్కరణలో కీలకపాత్ర పోషించిన రోజును జాతీయ చేనేత దినంగా ప్రకటించాలన్న మన తెలంగాణ బిడ్డ రాహుల్ ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో 2015లో అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 గా ప్రకటించడం చేనేత రంగానికి దక్కిన గౌరవం అన్నారు. కేంద్రప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకం కింద వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తూ, రుణాలు అందిస్తూ చేతి వృత్తుల వారిని ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలు నేసిన ఘనత మన నేతన్నలది అలాంటి నేతన్నలు ఈరోజు అన్నమో రామచంద్రా అంటూ బతుకు జీవనం కోసం గుజరాత్, మహారాష్ట్ర లకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఆగడం లేదన్నారు. నేడు చేనేత కార్మికులు బీడీ కార్మికులుగా మారుతున్న దుస్థితిని మనం చూస్తున్నాం అన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరల పంపిణీలో దోపిడీకి తెరలేపి మన చేనేత కార్మికులకు మొండి చేయి చూపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చేనేత కార్మికుల బతుకు జీవనం మాత్రం మారడం లేదు కారణం వారికి ప్రభుత్వం చేయూతను అందించడంలో విఫలం చెందుతుందని. వడ్డీ లేని రుణాలు లేవని,రుణమాఫీ లేదని, చేనేత యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడం లేదని, చివరికి చేనేత కార్మికులు నూలు పోగులతో ఉరేసుకోవాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో ఉందని మండిపడ్డారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ వారికి అండగా నిలవాలని డిమాండ్ చేసారు. అనంతరం చేనేత కార్మికులను శాలువాతో సత్కరించారు.


ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, చేనేత సాకార సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సత్యపాల్, ప్రసాద్,విజయలక్ష్మి బిజెపి నాయకులు కిషోర్, నాగరాజు, బొట్టు వెంకటేష్, పల్నాటి కార్తీక్, వేరేందర్, రవి, లక్ష్మణ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >