| Daily భారత్
Logo




డిక్లరేషన్ బీసీల పేరుతో... డెసిషన్ మైనారిటీల కోసం

News

Posted on 2025-08-07 13:06:47

Share: Share


డిక్లరేషన్ బీసీల పేరుతో... డెసిషన్ మైనారిటీల కోసం

సామాజిక న్యాయం కేవలం బిజెపి తోనే సాధ్యం

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీజేపీ జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ అన్ని వర్గల సంక్షేమే బీజేపీ లక్ష్యం అన్నారు సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యం అన్నారు

బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమే బీసీ ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి

రామ్ నాథ్ కోవింద్,ప్రసుత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము లాంటి సామాన్యులను గౌరవ స్థానాలకు చేర్చిన ఘనత బీజేపీదే.

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఇచ్చి, మైనారిటీ రిజర్వేషన్ అమలు చేయడం మోసం కాదు అంటే మరేంటి?పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీల కోసం ఏ పని చేశారో ఒక్కటైనా చెప్పగలరా?బీసీ ఓటుతో గెలిచి మైనారిటీ వర్గాలకే పదవులు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు.

బీజేపీ బీసీలకు గౌరవం, అవకాశాలు, భవిష్యత్తు ఇస్తోంది  కాంగ్రెస్ మాయ మాటలు మాత్రమే.బీసీలను ఓటు బ్యాంక్‌గానే కాదు, నాయకత్వ శక్తిగా చూస్తుందన్నారు. బీజేపీ.మోదీ పాలనలో బీసీకి గౌరవం ఉంది కాంగ్రెస్ పాలనలో మోసం మాత్రమే ఉంది.బీసీల పేరుతో పిక్నిక్‌లు చేస్తున్న వారిని ప్రజలు ఎప్పటికైనా గమనిస్తారు.బీసీల హక్కుల కోసం పోరాడేది బీజేపీ .బీసీ ఓటుతో ఎక్కి, మైనారిటీ ఆశీర్వాదంతో పదవులు పంచుకుంటే అది సేవ కాదు, ‘సెటప్’!అని దుయ్యాబట్టారు డిక్లరేషన్ పేరు బీసీ… డెసిషన్ మొత్తం మైనారిటీ ఇదేనా కాంగ్రెస్ మంత్రిత్వ తంత్రం?అని హెద్దవ చేశారు ఎన్నికల ముందు బీసీ ప్రేమ… అనంతరం మైనారిటీ సెటిల్మెంట్ ఇది కొత్త రాజకీయ ప్రేమకథ బీసీలకు దక్కే న్యాయం ప్రెస్ నోట్‌లోనే మిగిలిపోతుందా అని తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు అదే విదంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఆగష్టు 15 వ తేదీ వరకు జిల్లా లో హర్ గర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చేర్మెన్ కంచెట్టి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,నిమ్మల శ్రీనివాస్,బీజేపీ నాయకులు డాక్టర్ కొండ ఆశన్న,అమంద్ విజయ్, రాంచందర్,మాస్టర్ శంకర్, సంతోష్, ముత్యాలు, నారాయణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి,భూపాల్ రెడ్డి,మల్లేష్ గుప్తా, రాదా, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >