Posted on 2025-08-07 13:36:46
డైలీ భారత్, హైదరాబాద్:రాష్ట్రంలో ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్స్‌లో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం ఒక్కటి. ఈ ప్రచారం చాల రోజుల నుంచి నడుస్తున్న ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో చతికలపడింది. కాగా, మరోసారి ఈ విలీన ప్రచారం వీరంగం చేస్తోంది. తాజా పరిణామాలతో మళ్లీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారం జోరందుకుంది. అయితే.. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఎన్నిసార్లు కొట్టిపడేసిన మళ్లీ మళ్లీ తెరపైకి రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది
తాజాగా.. ఓ మాజీ బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం మళ్లీ రాష్ట్రంలో దుమారం రేపుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎవడెవడో ఎదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీకి మూడు చెరువుల నీళ్లు తాగించి బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అతి చేస్తోన్న పోలీసుల పని చెప్తామని హెచ్చరించారు. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో రాసి పెట్టుకుంటున్నామని తెలిపారు. అందరి లెక్కలు సెటిల్ చేసే బాధ్యత తనదే అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో కేసీఆర్ చూపించారని.. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో రేవంత్ రెడ్డి చూపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
రేవంత్ రెడ్డిని మరోసారి కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి ఓడిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి విచిత్రంగా తయారైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సేలు అతి తెలివిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ పార్టీలో ఉన్నామో కూడా పార్టీ మారిన వాళ్ళకు అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >