| Daily భారత్
Logo




విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన కాలేజ్ ఛైర్మన్

News

Posted on 2023-12-24 12:57:56

Share: Share


విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన కాలేజ్ ఛైర్మన్

డైలీ భారత్, భీమారం: హాస్టల్ గదిలో నిద్రిస్తున్న విద్యార్థినిపై ఆ కాలేజ్ ఛైర్మన్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. అర్ధరాత్రి హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన ఆ స్టూడెంట్ కేకలు వేయగా మిగతా స్టూడెంట్లు నిద్రలేచారు. కోపంతో మండిపడ్డ ఛైర్మన్.. స్టూడెంట్లపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి వెళ్లిపోయాడు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

భీమారంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ లో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన విద్యార్థిని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజ్ హాస్టల్ లో మిగతా స్టూడెంట్లతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కాలేజ్ ఛైర్మన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బూర సురేందర్ గౌడ్ వెళ్లాడు. విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో మిగతా విద్యార్థినులు నిద్రలేచి ఆ గదికి వచ్చారు. సురేందర్ గౌడ్ వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పడంతో తెల్లవారి వారు హాస్టల్ కు చేరుకున్నారు. కూతురుతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే, అప్పటికే సురేందర్ గౌడ్ అప్పటికే పరారయ్యాడని సమాచారం. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >