Posted on 2025-09-23 13:07:53
డైలీ భారత్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది,దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది,డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్‌లకు ఇవ్వనున్నారు. వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ అందనుంది.
ఈ అడ్వాన్స్‌ను తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేయనుంది,ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధి కారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు.
అడ్వాన్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్ సూచించారు.కాగా, దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతోంది.
టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు తోడ్పాటు అంది స్తున్నామని చెప్పగా.. ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >