| Daily భారత్
Logo




నిజామాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి

News

Posted on 2025-09-25 15:27:42

Share: Share


నిజామాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి

తీరోక్క పూలను పేర్చి మహిళా మణులతో ఆడి పాడిన సంధ్యారాణి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో కౌండిన్య మహిళా గౌడ సంఘం, పట్టణ గౌడ సంఘం 1 సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గౌడ కళ్యాణ వేడుకలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాలకు ముఖ్యఅతిథిగా పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. చిత్తూ చిత్తూల గుమ్మ.. శివుని ముద్దుల గుమ్మ అంటూ బతుకమ్మ పాటలను అనుకరిస్తూ మహిళల్లో జోష్ నింపారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అట్ల బతుకమ్మ రోజున గౌడ మహిళా సోదరీమణులతో కలిసి బతుకమ్మ పండుగను ఆడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను అలాగే వచ్చే దసరా పండుగను సుఖ సంతోషాల నడుమ  జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో గౌడ సంఘం నుంచి మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఆర్భాటంగా మహిళలను గౌరవ పరుస్తూ బతుకమ్మ పండగ అధికారకంగా ఆడేందుకు సిద్ధంగా ఉందన్నారు.


Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >