Posted on 2025-10-09 16:13:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ పాఠశాలలు, ఐ.టీ.ఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు, అదే ఆవరణలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ముఖ గుర్తింపు విధానం(ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు తీసుకున్నారా అని పరిశీలించారు. విద్యార్థులు కోసం వండిన మద్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. డైనింగ్ హాల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, పనులను పూర్తి చేయించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం బోధన్ పట్టణం, నిజామాబాద్ నగరంలలో ప్రభుత్వ ఐ.టీ.ఐ లకు అనుసంధానంగా ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఇంకనూ అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >