Posted on 2025-10-09 18:03:09
మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు స్పెషల్ డ్రైవ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజు 58 వ్యక్తులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ప్రధాన కారణమవుతున్నారు. కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపినవారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా, ఎన్నో కుటుంబాలు దాని వల్ల రోడ్డున పడుతున్నాయి.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, కామారెడ్డి జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వాహనదారులను కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయమూర్తుల ఎదుట హాజరుచేయడం ద్వారా జైలు శిక్షలు లేదా జరిమానాలు విధించడం జరుగుతోంది.
ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు మొత్తం 58 మందికి శిక్షలు విధించింది.దేవునిపల్లి PS లో 10 మందికి జైలు శిక్ష (4 మందికి 2 రోజుల జైలు, 6 మందికి 1 రోజు జైలు , ₹1000 జరిమానా ఒక్కోరికి, దోమకొండ PS లో ఒక వ్యక్తికి 2 రోజుల జైలు + ₹1000 జరిమానా,మాచారెడ్డి, కామారెడ్డి, బిక్నూరు PS లో ఒక్కొక్కరికి 1 రోజు జైలు + ₹1000 జరిమానా,
కామారెడ్డి లో 14 మంది, రామారెడ్డి 1 వ్యక్తి, దేవునిపల్లి 20 మంది, బిక్నూరు: 1 వ్యక్తి, దోమకొండ 6 మంది, రాజంపేట్ 1 , సదశివ నగర్ 1 వ్యక్తి, మొత్తం 44 మందికి ₹1000 చొప్పున జరిమానా విధించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ,మీ కుటుంబాన్ని, ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించి వాహనం నడపవద్దు. మీ నిర్లక్ష్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొందరు వికలాంగులై జీవితాంతం బాధపడుతున్నారు. ఇకనైనా వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపకూడదు. మీరు గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్‌పీ తెలిపారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >