| Daily భారత్
Logo




జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

News

Posted on 2025-10-10 06:22:38

Share: Share


జిల్లాలో  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

600 మంది పోలీసుల నిఘా లో ప్రత్యేక బందోబస్తు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శ్రావ్య గార్డెన్  లో సిబ్బందితో తమ తమ విధుల నిర్వహణ కోసము ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని , సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసిన త్వరితగతిన  తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని , ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని ఆదేశించారు.  అనునిత్యము సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు. సీఎం పర్యటన బందోబస్తుకు 600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. ఇట్టి బ్రీఫింగ్ సందర్భంగా అదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి , నిజామాబాద్,  ఆర్మూర్ , బోధన్ , సిసిఎస్ ,  సి టి సి , ట్రాఫిక్ ACP లు  రాజా వెంకటరెడ్డి , వెంకట్ రెడ్డి ,శ్రీనివాస్  నాగేంద్ర చారి , రాజశేఖర్ ,మస్తాన్ అలీ సీఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >