Posted on 2025-10-11 16:26:07
పార్టీ విధేయులకా.. లేదా యువతరానికి బాధ్యతలు అప్పజెప్పనున్నారా..?
టెన్షన్ లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: స్థానిక సంస్థలు ఎన్నికలు, ఆ తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పగ్గాలు ఎవరికి అధిష్టానం ఇవ్వనున్నారో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు డిసిసి బాధ్యతలు పార్టీ అధిష్టానం అప్పజెప్పనున్నారా.. లేదా యువతరానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పనున్నారా అనే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పార్టీ సీనియర్ నేతల్లో చురుగ్గా పాల్గొంటూ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తున్న నరాల రత్నాకర్ పేరు తెరపై వస్తుంది. మరోవైపు యువతరంలో గడుగు గంగాధర్ తనయుడు గడుగు రోహిత్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నారా, లేదా బొబ్బిలి రామకృష్ణ కు అప్పజెప్పను ఉన్నారా అనేది కొన్ని రోజులు ఆగాల్సిందే.
పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆశవాహుల నుంచి ఈ నెల 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జిల్లా పరిశీలకుడిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే రిజ్వన్ను నియమించారు. అయితే ఏడేళ్లుగా మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 15 రోజుల్లో జిల్లాకు కొత్త అధ్యక్షున్ని నియమించే అవకాశం ఉంది.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >