| Daily భారత్
Logo




ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్లుగా నియమించిన జాబితాలో విద్యాశాఖలో అవినీతి లీలలు

News

Posted on 2025-10-13 09:32:18

Share: Share


ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్లుగా నియమించిన జాబితాలో విద్యాశాఖలో అవినీతి లీలలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానా కలం గ్రామానికి చెందిన ఇంగోలి శిరీష తనకు జరుగుతున్న అన్యాయాన్ని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. కానాకాలం గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి వెళ్ళాకే మొదటి విడత ప్రకటించారని ఆ జాబితాలో తన పేరు అన్ని అర్హతలు ఉన్నాయని ఇంగోలి శిరీష తెలిపారు. అయితే విద్యాశాఖ రెండో జాబితా ప్రకటించాక ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఎడపల్లి ఎంఈఓ ను కలవగా ఇదంతా తనకేమీ తెలువదని మొత్తం జిల్లా విద్యాశాఖ అధికారికి తెలుసని ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి సంప్రదించవచ్చని చెప్పారని ఆమె వెల్లడించారు. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంలో కచ్చితంగా జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారుల అవినీతి వల్లే రెండో జాబితాలో తన పేరును తొలగించి మరొక వ్యక్తి పేరును చేర్చడం జరిగిందని ఈ పూర్తిగా తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం ఎక్స్పీరియన్స్ అని అందులో లేదు కానీ ఆ వ్యక్తిని ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకున్నామని డిఇఓ చెప్తున్నారని దీనిపై కలెక్టర్ తగిన విచారణ చేసి తనకు వచ్చిన ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని ఆమె వేడుకున్నారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే జిల్లా విద్యాశాఖ అధికారుల పై కోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.


Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >