| Daily భారత్
Logo




కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో కెమెరాలు

News

Posted on 2025-10-27 16:38:48

Share: Share


కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో కెమెరాలు

డైలీ భారత్, గంగాధర:గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానిక ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పాఠశాలలో పని చేస్తున్న అటెండర్‌ యాకుబ్ పాషా గత ఏడాదికాలంగా పాఠశాలలో చదువుకుంటున్న అమ్మాయిలను వేధిస్తున్నాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే ఆ పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్‌ అమ్మాయిలను తరచుగా అనవసరంగా మాట్లాడటం, బాత్రూం వైపు వెళ్తున్నప్పుడు వారి ఫోటోలు మొబైల్‌లో తీయడం తో పాటు రహస్యంగా కెమెరాలు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు తెలిపారు. అతను తీసిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ విద్యార్థులను మానసికంగా వేధించినట్లు సమాచారం.

ఈ వ్యవహారం గత కొంతకాలంగా కొనసాగుతుండగా, విద్యార్థులు మరియు కొందరు తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు పెద్దగా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన ఇంత పెద్ద స్థాయికి చేరిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థిని ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఘటన బయటపడింది. గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగి, పాఠశాల వద్ద తల్లిదండ్రులు, ప్రతినిధులు భారీగా చేరి నిరసనలు వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థుల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్‌ తో పాటుగా అటెండర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

"పిల్లలు పాఠశాలకు భయంతో వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మా పిల్లలకు న్యాయం చేయాలి, బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి" అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటన వెలుగులోకి రావడంతో గ్రామమంతా ఆగ్రహావేశానికి లోనైంది. గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కలిసి ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. పాఠశాల సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని, అటెండర్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >