| Daily భారత్
Logo




హజారుద్దీన్ ను మంత్రివర్గ కేబినెట్లో తీసుకుంటే బిజెపి, బీఆర్ఎస్ లకు అభ్యంతరం ఏంటి..?

News

Posted on 2025-10-30 13:17:52

Share: Share


హజారుద్దీన్ ను మంత్రివర్గ కేబినెట్లో తీసుకుంటే బిజెపి, బీఆర్ఎస్ లకు అభ్యంతరం ఏంటి..?

ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి

టిపిసిసి చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ విమర్శ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మేటి క్రీడాకారుడు అజారుద్దీన్ కేబినేట్ లోకి తీసుకోవాల‌ని భావిస్తే బీజేపీ,బిఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీప్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ

కెప్టెన్ గా అజారుద్దీన్  దేశానికి సుదీర్థ కాలం  సేవ‌లు అందించారు. బీజేపీ,బిఆర్ఎస్ చీక‌టి ఒప్పందాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. అజారుద్దీన్ కేబినేట్ లోకి తీసుకోవాల‌ని సీఎం భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుటీల ప్ర‌య‌త్నం చేస్తోందన్నారు. అజారుద్దీన్ గురించి దేశ, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియంది కాదన్నారు. క్రీడా ప్ర‌పంచానికే కాదు ఎంపీగా అజారుద్దీన్  ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించారన్నారు. అజారుద్దీన్ ను మంత్రి కాకుండా ఎలక్ష‌న్ క‌మిష‌న్ కు బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేయ‌డం విచార‌క‌రం అన్నారు. అనైతికంగా  అజారుద్దీన్ మంత్రి కాకుండా బీజేపీ,బీఆర్ఎస్‌ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుందన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖ‌రి ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి న  అవ‌స‌ర‌ముందన్నారు.

గతంలో బీజేపీ  రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని మంత్రిని చేశారన్నారు. ఉప ఎన్నిక‌ అభ్య‌ర్థిని మంత్రిగా చేస్తే త‌ప్పులేనిది? అజారుద్దీన్ మంత్రి చేస్తే త‌ప్పేంటి అని బీజేపీ నేత‌ల‌ను సూటిగా  అడుగుతున్నా అని అన్నారు. అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ పైన  బీజేపీ ఒత్తిడి తీసుకువ‌స్తోందన్నారు. బీజేపీ తో బిఆర్ ఎస్ కుమ్మ‌క్కై ఉంద‌ని కేసీఆర్ కూతురు క‌విత స్వ‌యంగా చెప్పారని గుర్తు చేశారు. మైనార్టీల‌కు ల‌బ్ది చేకూరుతుంద‌నే ఉద్దేశ్యంతోనే అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. గ‌వ‌ర్నర్ పై కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి తెస్తుంద‌న్న స‌మాచారం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు విజ్క్షులు అని, కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయం అని అన్నాను అజారుద్దీన్ , కోదండ‌రాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి కేబినేట్ గ‌వ‌ర్న‌ర్ కి పంపిందని, అక్క‌డ పెండింగ్ ఉందన్నారు. కోర్టులో గెలిచితీరుతామ‌న్న న‌మ్మ‌కముంది. అజారుద్దీన్ కేబినేట్ లోకి రావ‌డం ఖాయం అని స్పష్టం చేశారు. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయ‌స్సుకోసం కృషి చేస్తార‌న్న న‌మ్మ‌క‌ముందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, జావిద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >