| Daily భారత్
Logo




ఫైనల్ కు చేరిన భారత్

News

Posted on 2025-10-30 18:43:24

Share: Share


ఫైనల్ కు చేరిన భారత్

డైలీ భారత్, క్రికెట్ న్యూస్:మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్‌ బరిలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి, అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

భారత్ విజయానికి జెమిమా రోడ్రిగ్స్‌ (127 నాటౌట్‌) సెంచరీతో కాంతినింపగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ జంట 180కి పైగా పరుగుల భాగస్వామ్యం కట్టి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ బాదగా, ఎలీస్ పెర్రీ (77) అర్ధశతకంతో రాణించింది. చివర్లో ఆష్లీన్ గార్డ్‌నర్‌ (63) దూకుడుగా ఆడినా, భారత బౌలర్ల ఆఖరి దెబ్బలతో ఆసీస్‌ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసి మెరుపులు మెరిపించగా, క్రాంతి గౌడ్‌, అమన్‌జ్యోత్ కౌర్‌, రాధా యాదవ్ చెరో వికెట్‌ సాధించారు. నవంబర్‌ 2న ఫైనల్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >