| Daily భారత్
Logo




బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు

News

Posted on 2025-10-31 13:21:26

Share: Share


బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్  150వ జయంతి వేడుకలు

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనేలేని సేవలు అందించిన ఉక్కుమనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150  వ  జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, దేశ ప్రజలకు జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నివాళుల కార్యక్రమం ఘనంగా అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నేతృత్వంలో ఆర్‌ఆర్‌ చౌరస్తా శివాజీ విగ్రహం నుండి వర్ని చౌరస్తా వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ  నినాదం తో భారీ మార్చ్  నిర్వహించారు. జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. నగర  వాసులు, యువత భారీ సంఖ్యలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ పటేల్  కేవలం ఒక నాయకుడు కాదని, ఆయన ఒక శక్తి, ఒక సంకల్పం, ఒక ధైర్యస్వరూపం అని కొనియాడారు. దేశం స్వతంత్రం పొందిన వెంటనే 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం — చరిత్రలో ఓ అద్భుతం. ఈవి ఏవి బలప్రయోగం ద్వారా కాదు, ఆయన తెలివితేటలు, దౌత్యం, కఠిన నిర్ణయాలు భారతదేశాన్ని ఐక్యంగా నిలిచేలా చేశాయి అని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో, పటేల్  కలల భారత్ సాకారం అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం  నిర్మాణం — పటేల్ వారసత్వాన్ని నూతన భారతానికి పరిచయం చేసిందన్నారు. బలమైన నిర్ణయాలు, స్థిర నిబద్ధత ఇవన్నీ పటేల్ స్ఫూర్తి అని, ఈరోజు మనం సర్దార్ పటేల్ జయంతిని జరుపుకోవడం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. భారత ఐక్యతను కాపాడే బాధ్యతను మళ్లీ గుర్తుచేసుకునే రోజు ఇది అని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రతి యువకుడు ఆయన స్ఫూర్తిని అనుసరించాలన్నారు. ఆయన త్యాగం, నిబద్ధత తరతరాలకు దిశానిర్దేశం చేస్తాయి అని యువతకు దిశానిర్దేశం చేసారు. సర్దార్ పటేల్ మహనీయ స్ఫూర్తికి గుర్తుగా వారి విగ్రహం ఉన్న వర్ణి చౌరస్తాను ఇవాళ నుండి ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా ’గా పిలవాలని కోరారు. యూనిటీ మార్చ్ అనంతరం సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐక్యత, సేవ, దేశభక్తి విలువలను ప్రజలు ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు జాతీయ చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >