| Daily భారత్
Logo




ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

News

Posted on 2025-11-01 13:58:33

Share: Share


ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

నూతన ఐఎంఏ జిల్లా అధ్యక్షునిగా ప్రముఖ మానసిక వైద్యులు ఆకుల విశాల్ ఎన్నిక

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ 2025-26 నూతన కార్యవర్గాన్ని ఐఎంఏ హాల్లో ముఖ్య ఎన్నికల  అధికారి డాక్టర్ జీవన్ రావ్, ఎన్నికల అధికారులు డా. సుభాష్,

డా. బి. దామోదర్ రావు ల సమక్షంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అనంతరం నూతన కార్యవర్గాన్ని  ఐఎంఏ నేషనల్ ఎథిక్ష్ కమిటి చైర్మన్ రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్. ఏలేటి రవీంద్రరెడ్డి  ప్రామాణస్వీకారం చేయించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా  అధ్యక్షులుగా మానసిక వైద్యులు, ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శిగా ఈ ఎన్ టి  సర్జన్  డా. హరీష్ స్వామి,కోశాధికారిగా డా. కే. రమనెశ్వర్, ప్రెసిడెంటు ఎలెక్ట్ గా వచ్చే సంవత్సరానికి (2025-26 ) డా. కొట్టూర్ శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా డా. అరవింద్ రెడ్డి, డా. ఎండి  రషీద్ అలీ,  సహాయ కార్యదర్శులుగా డా. రాజేంద్ర ప్రసాద్, డా. నవీన్ మాలు, డా. ప్రజ్ఞ, కార్యవర్గ సభ్యులుగా డా. వి. రాజేష్, డా. సి. శ్యాంసుందర్, డా. ఫరీద బేగం, డా. రాజ్ కమల్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన  ఐఎంఎ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విశాల్ ఆకుల డా. హరీష్ స్వామిలు మాట్లాడుతూ. వైద్య వృత్తిలో ఉన్న తాము ప్రాణాప్రాయ స్థితిలో తమ ఆసుపత్రులకు వచ్చే అత్యవసర కేసులను వీలైనంత మట్టుగా వారి ప్రాణాలు కాపాడేందుకే ప్రయత్నిస్తామే తప్ప, ఏ ఇతర కారణాల వల్ల ఒక ప్రాణం తీసుకోబోమని వారు స్పష్టం చేశారు. దీన్ని కొందరు కుటుంబ సభ్యుల ను రెచ్చగొట్టి ప్రవేట్ ఆసుపత్రులపై దాడులు, దేవుడితో సమానమైన వైద్య వృత్తిలో ఉన్న తమపై ప్రత్యక్ష దాడులకు దిగడం సరైన చర్య కాదని వారు అన్నారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రభుత్వ వైద్య రంగాన్నికి  ప్రజలకు వారధిగా  ఉంటూ, వైద్యులకు ఈ రోజుల్లో వస్తున్న ఆధునాతనమైన వైద్యం  పట్ల అవగాహన సదస్సులు  నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ఎథిక్ష్ కమిటి చైర్మన్,  రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్. ఏలేటి రవీంద్రరెడ్డి , ఎన్నికల ముఖ్య అధికారి డా. టి. జీవన్ రావ్ ఐఎంఏ ఎన్నికల అధికారులు  డా. దామోదర్ రావు, డా. సుభాష్, మాజీ అధ్యక్షలు డా.డి ఎల్ ఎన్ అజ్జ శ్రీనివాస్, మాజీ ప్రధాన   కార్యదర్శి డా. విక్రం రెడ్డి , డా. రాజేందర్ సూరినీడు, సీనియర్ వైద్యలు , డా. డి ఎల్ ఎన్ స్వామి, డా. సత్య నారయణ, డా. కౌలయ్య, డా.వినోద్, కుమార్ గుప్తా, డా. జయని నెహ్రు,  డా. కవిత రెడ్డి,  డా పాటు జలగం తిరుపతి రావు, డా. శివ ప్రసాద్, తానా  ప్రధాన కార్యదర్శి  డా. కప్పల రాజేష్ తో పాటు దదాపు 70 కి పైగా వైద్యులు పాల్గొన్నారు.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >