| Daily భారత్
Logo




వరంగల్‌ రహదారిపై కారు బీభత్సం

News

Posted on 2025-11-03 13:26:27

Share: Share


వరంగల్‌ రహదారిపై కారు బీభత్సం

అదుపుతప్పి దంపతులపైకి దూసుకెళ్లిన వాహనం

అక్కడికక్కడే మృతి చెందిన దంపతులు

కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద ఘటన..

డైలీ భారత్, యాదాద్రి: వరంగల్‌ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న దంపతులపైకి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బోడ్డుప్పల్‌లో నివాసం ఉంటున్న గర్దాసు ప్రశాంత్‌ (32), ప్రసూన దంపతులు ఆదివారం వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో ఉన్న తమ బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో బీబీనగర్‌ పెద్దచెరువు సమీపంలోకి రాగానే ప్రశాంత్‌కు ఫోన్‌ రావడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి దంపతులను ఢీకొట్టింది. ప్రశాంత్‌ రోడ్డుపై 20 అడుగుల దూరంలో ఎగిరిపడి మృతి చెందగా ప్రసూన పక్కనే ఉన్న చెరువు అలుగు ప్రదేశంలో పడి ప్రాణాలు విడిచింది. కారు చెట్టుకు ఢీకొని ఎడమ వైపున సర్వీస్‌ రోడ్డుపై పడింది. కారు నడుపుతున్న షణ్ముక్‌ తలకు తీవ్ర గాయాలు కాగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న భార్గవ్‌, సాయిరిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు.

కారును అద్దెకు తీసుకుని యాదగిరిగుట్టకు..

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన తంగెళ్లపల్లి షణ్ముక్‌, చైతన్యపురికి చెందిన భార్గవ్‌, వరంగల్‌ పద్మానగర్‌కు చెందిన సాయిరిత్‌ హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకునేందుకు ఎల్బీనగర్‌లో కారును అద్దెకు తీసుకుని బయలుదేరిన ముగ్గురు బీబీనగర్‌ వద్ద ప్రమాదానికి కారణమై తీవ్రంగా గాయపడ్డారు.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >