Posted on 2025-11-03 13:31:12
తన భూ సమస్య పరిష్కరించాలంటూ మహిళ గడ్డి మందు తాగేందుకు యత్నం
అడ్డుకున్న కలెక్టరేట్ భద్రత సిబ్బంది
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌కు వచ్చింది. తన వెంట పురుగుల మందు తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో గడ్డి మందు తాగేందుకు డబ్బాను బ్యాగులో నుంచి బయటకు తీసింది. గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమె గడ్డి మందు తాగకుండా అడ్డుకున్నారు. రూరల్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సాలూర మండలం సాలంపాడ్‌కు చెందిన బాధితురాలు జయమ్మ మాట్లాడుతూ తనకు రెండెకరాల పొలం, ఇద్దరు కుమారులు ఉన్నారని, అయితే తన పొలంలోని అర ఎకరం భూమిని తనకు తెలియకుండా చిన్న కుమారుడు విక్రయించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొలానికి సంబంధించిన పూర్తి పత్రాలు తన వద్దని ఉన్నాయని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని చెప్పారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె వెల్లడించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >