| Daily భారత్
Logo




రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

News

Posted on 2025-11-03 14:52:48

Share: Share


రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

డైలీ భారత్, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నారాయణఖేడ్ నియోజకవర్గం, కల్హేర్‌కు చెందిన సందీప్.. గత ఒక సంవత్సరం నుంచి సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

అయితే.. ఈ ఆత్మహత్యకు సంబంధించిన ప్రధాన అనుమానం ఒకటి వెలుగులోకి వచ్చింది. సందీప్ ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై.. ఆ క్రమంలో భారీగా డబ్బులు పోగొట్టుకోవడం వల్లే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని ఉంటాడని స్థానిక వర్గాలు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ద్వారా ఆర్ధికంగా నష్టపోయి.. ఆ ఇబ్బందులను తట్టుకోలేకనే అతను తన వద్ద ఉన్న తుపాకీని ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే రూరల్ పోలీసులు సమాచారం అందుకుని.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరణానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కేసు వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కేవలం వారం రోజుల క్రితమే.. కామారెడ్డిలో కూడా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జీవన్‌రెడ్డి, పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >