Posted on 2025-11-07 14:27:45
వందేమాతర గేయం రచించి 150 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఎంపీ అర్వింద్ వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో ఉత్సాహం నింపిన గేయంగా వందేమాతరం చరిత్రలో నిలిచిపోయిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ నగర శివారులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 150 చోట్ల ఈ కార్యక్రమాన్ని పండగ లా చేయాలని నిర్ణయించిందని అన్నారు. 150 వ సంవత్సరాన్ని ఇలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సామూహికంగా వందేమాతర గీతాలాపన చేశారు. ఈనెల 26 వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. అనంతరం నాయకులు, విద్యార్థులతో కలిసి స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, విద్యా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >