Posted on 2025-11-22 12:47:42
డిసెంబర్ 09 న బీసీ తిరుగుబాటు మహా సభ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 18 శాతం బీసీ రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న స్థానిక సంస్థల కార్యాచరణను వెంటనే నిలిపివేసి ఇచ్చిన హామీ మేరకు 42 శాతం కేంద్ర, న్యాయ అనుమతి వచ్చేవరకు ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించోద్దని డిమాండ్ తో డిసెంబర్ 9న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో నిర్వహిస్తున్నామని తెలంగాణ బ్యాక్వర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన తమ బీసీ సంఘం నేత దోసపూడి నరహరి నేతృత్వంలో 16 మందితో అదే విధంగా సీనియర్ నాయకుడు భాష 16 మందితో అదే విధంగా సీనియర్ నాయకుడు భాస రాజేశ్వర్ నేతృత్వంలో సలహామండిలిని ఏర్పాటు చేశామని, ఆహ్వాన సంఘం వివరాలను ఆయన వెల్లడించారు. ఇది కేవలం ప్రాథమిక కమిటీ మాత్రమేనని త్వరలో నగర, రూరల్, నియోజకవర్గ కమిటీలను, కుల సంఘాలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆ కమిటీలు జిల్లా, సమీప జిల్లాలో విస్తృతంగా పర్యటించి, గ్రామ కుల సంఘాలతో ఇక్కడ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆ కమిటీలు జిల్లా, సమీప జిల్లాలో విస్తృతంగా పర్యటించి గ్రామ కుల సంఘాల ప్రజాసంఘాలను కలుపుకొని చైతన్య సదస్సులను ఏర్పాటు చేసి డిసెంబర్ 9న జరిగే మహాసభను విజయవంతం చేసే దిశగా కార్యాచరణను రూపొందించుకుంటారని ఆయన తెలిపారు. ఈ చైతన్య సభలో రాష్ట్ర ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవడంలో రెండు సంవత్సరాలుగా చేసిన కాలయాపనను ఎగరగొట్టడానికి చేసిన కుట్రను వివరిస్తారని ఆయన తెలిపారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలను అవగాహనతో చేసిన మోసాన్ని వివరిస్తారని ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో కోకన్వీనర్లు కొండవీటి శ్యాం ప్రసాద్, గుట్టు గంగాధర్, హనుమంతరావు, నాగన్న, అంబదాస్, పృధ్విరాజ్, రేంజర్ల సురేష్ ( అడ్వకేట్) తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >