Posted on 2025-12-09 22:34:24
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం ఇవాళ్టి సాయంత్రంతో గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఉత్సాహం క్రమంగా టెన్షన్‌గా మారుతోంది. ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో, ఇప్పుడు అభ్యర్థులు, కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతర లింగంలోని ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభమై, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.ఎన్నికల నిబంధనల ప్రకారం, ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు తొలి విడత ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు బంద్ అమల్లోకి వచ్చింది. ఇక మొదటి విడతలో ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికై, పోటీ లేకుండానే కొత్త పాలన బాధ్యతలు చేపట్టనున్నాయి. తొలి విడత పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతుండగా.. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >