| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి : గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-12-11 19:23:59

Share: Share


కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి : గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లావణ్య చెన్నయ్య ప్రచార సభలో చేవెళ్ల కాలే యాదయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కత్తెర గుర్తుకు ఓటు వేసి లావణ్య చెన్నయ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు కోరారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని,పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తే భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని అన్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావాహులు ఎవరు కూడా నిరాశపడవద్దని. రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, గణపురం ప్రభాకర్, వార్డు అభ్యర్ధులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >