| Daily భారత్
Logo




మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచుల హవా

News

Posted on 2025-12-12 18:56:19

Share: Share


మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచుల హవా

184 సర్పంచ్ స్థానాలకు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం

డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అత్యధిక మెజారిటీ ఓట్లు దక్కడం చూస్తే కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత లో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఇది జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన పై ఉన్న నమ్మకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించడం జరిగిందని, ఈ సందర్భంగా సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇల్లులేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది అని, ఇందిదిరమ్మ ఇండ్లు ఇప్పటికే ఎన్నో అందించడం జరిగిందని, కానీ గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ పేరుతో ప్రజల వద్ద కమిషన్లు తీసుకున్నారని నగేష్ రెడ్డి అన్నారు. అదేవిధంగా రైతుల కొరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందని, రైతు భరోసా పేరుతో ఎకరానికి సంవత్సరానికి 12 వేల రూపాయలు అందించడం జరుగుతుంది అని, మహిళల కొరకు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని గత ప్రభుత్వ పాలనలో ఏ రోజు కూడా అర్హులైన పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డులు అందించలేదు అని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి గృహ జ్యోతి పేరుతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగి వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి పాలనను గాడికి వదిలేసిన వ్యక్తి కెసిఆర్ అని, పేర్కొన్నారని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినప్పుడు14 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం 84 లక్షల కోట్ల అప్పులోకి లాగిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒకపక్క గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ, స్కాలర్షిప్, వివిధ కాంట్రాక్టు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తుందని, అదేవిధంగా మహిళల సాధికారత కొరకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీలు తీసుకునే క్రమంలో కూడా కమిషన్లు తీసుకొని 11.5 రూపాయలకు వడ్డీ తీసుకోవడం జరిగిందని, ఇది కేవలం బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలకు నిదర్శనమేనని వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగ, జిల్లాలో సుమారు 80% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది అని నగేష్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవదల్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, మహమ్మద్ ఈసా ,అబ్దుల్ ఎజాజ్ ,సాయికిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >