| Daily భారత్
Logo




ప్రచార మైకుల నిశ్శబ్దం వెనుక గెలుపు సంబరాల ఉత్సాహం దాగిఉంది

News

Posted on 2025-12-16 09:08:21

Share: Share


ప్రచార మైకుల నిశ్శబ్దం వెనుక గెలుపు సంబరాల ఉత్సాహం దాగిఉంది

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:తెలంగాణ పల్లెల్లో గత కొన్ని రోజులుగా మారుమోగిన ప్రచార హెూరు ముగిసింది. మైకుల శబ్దాలతో, జెండాల ఊపులతో రాత్రి పగలు అనే తేడా లేకుండా సాగిన ఎన్నికల సందడి ఒక్కసారిగా ఆగిపోయింది. నిన్నటి వరకు జనసందోహంతో ఉప్పొంగిన వీధులు నేడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం వెనుక గెలుపు సంబరాల ఉత్సాహం దాగిఉంది. గ్రామాల్లో గడప గడపకు వెళ్లి తమ విధివిధానాలు వివరించి, హామీలతో ఆకట్టుకున్న సర్పంచ్ అభ్యర్థులు ప్రజా తీర్పు కోసం సిద్దమయ్యారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గంలో 

7 మండలాల పరిధిలోని అనేక గ్రామ పంచాయతీలలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన సర్పంచ్  పోరులో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల పార్టీల బలం మాత్రమే కాదు,అభ్యర్థుల గుణగణాలు, ప్రజలతో వారి అనుబంధం కూడా కీలకంగా మారనుంది. 

ఇంతకాలం సర్పంచ్ ఎన్నికల హడావుడితో గడిచిన పల్లెలు ఇప్పుడు శాంతంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రజల మనసుల్లో మాత్రం కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఇచ్చిన హామీలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయోనని గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరాలని  మాటలు కాదు పనులే కావాలని గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. 

గత రెండు విడత ల్లో జరిగిన ఎన్నికలు పార్టీల స్థితిగతులు, అభ్యర్థుల కార్యాచరణ, ప్రజల మద్దతు ఈ మూడు కలిసి ఫలితాలను ఎలా మలిచాయో స్పష్టంగా చూపించాయి. మరి మూడో విడత ఎన్నికలు పాలనలో ఏ విధమైన మార్పు దిశగా మారుతాయో వేచి చూద్దాం

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >