Posted on 2025-12-16 11:22:24
భర్త పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో బయటపడ్డ విషయం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవ మాసాలు కడుపులో మోసిన ఆ తల్లి రెండు నెలల బాబును మధ్యవర్తుల ద్వారా ఓ వ్యక్తికి విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన శ్రీనివాస్, లక్ష్మీల దంపతుల రెండు నెలల పసికందు ఈ నెల ఐదున ఇంట్లో కనిపించకపోవడంతో బాలుడి తండ్రి శ్రీనివాస్ 4 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 5న మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ రెండు నెలల బాలుడి తల్లి డబ్బుల కోసం ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పూనే కు చెందిన విశాల్ అనే వ్యక్తికి రెండున్నర లక్షలకు బాలుడిని విక్రయించడానికి ఒప్పుకున్నట్లు పోలీసుల కథనం ద్వారా తెలుస్తుంది. నిజామాబాద్ కు చెందిన రమాదేవి, మంజుల హైదరాబాద్కు చెందిన విట్టల్ ముగ్గురు కలిసి లు ఈ ముగ్గురు కలిసి తల్లి లక్ష్మి తో సహా హైదరాబాద్ శివారులో పూణే కు చెందిన విశాల్ కు అప్పచెప్పడానికి ఈ నెల 9న వెళ్లి రెండున్నర లక్షలు తీసుకువచ్చినట్లు సమాచారం. పోలీసులకు సోమవారం నిందితులు దొరకగా తల్లి లక్ష్మిని కోర్టులో హాజరు పరిచినట్లు మిగతా నలుగురు పై కూడా కేసు నమోదు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై వివరించారు. అయితే పిల్లలు పుట్టడం లేదని పిల్లలు లేరని ఈరోజుల్లో భార్యాభర్తలు దూరమవుతున్న నేపథ్యంలో కన్నతల్లి ఇలాంటి ఘటన చేయడం బాధాకరం.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >