Posted on 2025-12-16 11:27:32
వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై జాతీయ వైద్య కమిషన్ కీలక ఆదేశాలు
చేతిరాత స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలని సూచన
పర్యవేక్షణకు ప్రత్యేక సబ్-కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు
జనరిక్ పేర్లతోనే మందులు రాయడం తప్పనిసరి
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లు (మందుల చీటీలు) స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలని జాతీయ వైద్య కమిషన్ (NMC) స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రతి వైద్య కళాశాలలో ఒక ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ఆరోగ్య హక్కులో అంతర్భాగమని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఎన్ఎంసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి మెడికల్ కాలేజీలోని డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ (డీటీసీ) కింద ఒక సబ్- కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. వైద్యులు మందులు రాసే పద్ధతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తుంది. వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >