Posted on 2025-12-19 08:07:52
డైలీ భారత్ న్యూస్, తిరుపతి జిల్లా: “అన్నా హెల్మెట్ ధరించండి"అనే నినాదాలతో తిరుపతి రూరల్ మండలంలోని ధనలక్ష్మి నగర్‌లో గల భాష్యం స్కూల్ విద్యార్థులు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవ హారం చేపట్టారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని తిరుపతి రూరల్ పోలీస్ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతగానో దోహదపడుతుందన్న అంశాలను ప్రజలకు తెలియజేశారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
#tirupati #bhasyam school
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >