| Daily భారత్
Logo




రేషన్ కట్.. అనేది ఉండదు..

News

Posted on 2025-12-19 08:45:17

Share: Share


రేషన్ కట్.. అనేది ఉండదు..

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు

ఈ కేవైసీ కి ఏలాంటి తుది గడువు లేదు..

స్పష్టం చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి పౌరసరఫరాల శాఖ తెరదించింది. ఈ నెల 31లోగా e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేయకపోతే ప్రభుత్వం పంపిణీ చేయనున్న "సన్నబియ్యం" నిలిపివేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి.

నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర స్పందిస్తూ.. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన వివరణ ఇచ్చారు.

e-KYC ప్రక్రియ అనేది రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుల వివరాలను ధృవీకరించుకోవడానికి చేసే ఒక ప్రామాణిక చర్య అని అధికారులు తెలిపారు. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణానికి వెళ్లి తమ వేలిముద్రలు (Biometric) లేదా కనుపాప గుర్తులను (Iris) నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తుది గడువు విధించలేదని కమిషనర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరినీ రేషన్ కు దూరం చేసే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ e-KYC ప్రక్రియ పూర్తి చేయడం మేలని ప్రభుత్వం సూచిస్తోంది. ముఖ్యంగా అనర్హుల పేర్లను తొలగించడానికి, అలాగే కార్డులో ఉండి చనిపోయిన వారి పేర్లను గుర్తించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. లబ్ధిదారులు ఆందోళనతో రేషన్ షాపుల వద్ద గుమికూడకుండా, తమకు వీలైన సమయంలో వెళ్లి ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రభుత్వ అధికారిక ప్రకటనలతో క్షేత్రస్థాయిలో ఉన్న అయోమయం తొలగిపోయినట్లయింది.

Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >
Image 1

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:38:05

Readmore >
Image 1

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On 2026-06-21 13:42:34

Readmore >