Posted on 2025-12-19 18:08:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శబరిమలై అయ్యప్ప స్వామి పాదయాత్ర నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 44 రోజుల పాటు కొనసాగిన ఈ పవిత్ర పాదయాత్రలో అయ్యప్ప స్వామి దర్శనం సంపూర్ణంగా జరగడంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా నివాసంలో వారికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పాదయాత్రను నందకిషోర్ గురుస్వామి, జగదీష్ గురుస్వామి, రాజేందర్ గురుస్వామి, వసంత్ రాజ్ గురుస్వామి ల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు నియమనిష్ఠలు పాటిస్తూ పాదయాత్రలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప భక్తుల నియమ దీక్ష, భక్తి నిబద్ధతను అభినందిస్తూ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ శబరిమలై పాదయాత్ర భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి, సమాజానికి సద్భావన సందేశాన్ని అందించిందని వారు పేర్కొన్నారు.
నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >