Posted on 2025-12-19 18:26:22
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన మూడు నెలల ప్రత్యేక కార్యక్రమం ‘ మీ డబ్బు – మీ హక్కు’ లో భాగంగా ఈ నెల (డిసెంబర్) 20న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు – మీ హక్కు అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి 2025 అక్టోబర్ 4న గుజరాత్ లోని గాంధీనగర్ లో జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇది 2025 అక్టోబర్ 01 నుండి 2025 డిసెంబర్ 31 వరకు మూడు నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని చేపట్టారన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో శిబిరం జరుగుతుందని, క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థ, శిభిరంలోని దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్.బి.ఐ ఉద్గమ్ వెబ్ సైట్ (http://udgam.rbi.org.in) ద్వారా పొందవచ్చని తెలిపారు.
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >
వైరా నియోజకవర్గం : కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Posted On 2026-06-22 19:48:03
Readmore >
చెన్నై ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారం : భార్య అమర్చిన రహస్య CCTVలో భర్త
Posted On 2026-06-22 19:44:31
Readmore >
నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >