| Daily భారత్
Logo




తలాపున గోదావరి... ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కరువు!

News

Posted on 2026-06-22 19:46:38

Share: Share


తలాపున గోదావరి... ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కరువు!

పేదల ఇళ్లకు ఇసుక లేదు... బడా బాబుల భవనాలకు మాత్రం పట్టపగలే జోరుగా ఇసుక!..

డైలీ భారత్, అశ్వాపురం: మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి నది సమీపంలో ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన ఇసుక దొరకడం లేదని పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఇసుక కొరత కారణంగా నత్తనడకన సాగుతుండగా, కొంతమంది బడా బాబులు నిర్మిస్తున్న ప్రైవేట్ భవనాలకు మాత్రం పట్టపగలే ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక తరలింపు జరుగుతుండటం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే పేదలకు ఇసుక అందకపోవడం, మరోవైపు భారీ నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా కొనసాగుతుండటంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక పంపిణీలో పారదర్శకత పాటిస్తున్నారా? ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >
Image 1

ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డ్స్ అందించాలి

Posted On 2026-06-22 20:06:26

Readmore >
Image 1

వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం

Posted On 2026-06-22 19:49:36

Readmore >