Posted on 2026-06-22 19:45:38
కలెక్టర్ ఆఫీసులో జాయింట్ కలెక్టర్ కి మెమోరాండం అందజేత
కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్
డైలీ భారత్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బిజెపి అనుబంధం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ వానాకాలం (ఖరీఫ్) సీజన్ 2026 ప్రారంభమై రోజులు గడుస్తున్న ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక రూపొందించకపోవడం విచారకరమన్నారు. విత్తనాలు విత్తె నాటినుండి మార్కెట్లో కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రతి దశలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఏ ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణం పంట వేయాలి ఎరువులు లభ్యత ఎంత కొనుగోలు కేంద్రాలు ముందస్తు ఏర్పాట్లు ఏమిటి అంశాలపై రైతులకు ముందే స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విత్తనాలు సీజన్ ప్రారంభమైందని,కావున నకిలీ విత్తనాల విక్రయాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైన దిగుడొచ్చే విత్తనాలు అందజేయాలని కోరారు. అంతేగాక ప్రైవేట్ డీలర్స్, విత్తన కంపెనీలు, పత్తి, మిర్చి, వరి విత్తనాలు నకిలీ విత్తనాలు రైతులకు మాయ మాటలు చెప్పి అమ్ముతున్నారని పేర్కొన్నారు. రైతులు పెట్టుబడి అంతా పెట్టి దిగుబడి రాకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.రబీ సీజన్ లో పెండింగ్ లో ఉన్న రైతు భరోసా, ఇప్పుడు జూన్ ఖరీఫ్ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.
రైతులందరికీ రు. 2 లక్షలు దాటిన బ్యాంకు రుణాలు, రైతులందరికీ కూడా రు. లక్షల వరకు రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలకు రు. 12 వేల ఇవ్వాలని కోరారు. ఎరువులు యాప్ ద్వారా తీసుకోవడం రైతులకు కష్టంగా ఉంటుందని,కావున రైతులకు డైరెక్టుగా ఎరువులు ఇవ్వాలన్నారు. యూరియా, ఇతర ఎరువులు కొరత లేకుండా చూడాలని వివరించారు.
పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసు, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పైడిపల్లి రవీందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్, లక్ష్మీదేవి మండల అధ్యక్షుడు నవీన్, తెల్లం నరసింహారావు, నిమ్మటూరి రామారావు, బానోత్ కుమార్, గడ్డం అజయ్ కుమార్, భూక్య మోహన్, బిజెపి కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >