Posted on 2025-12-19 19:42:33
కొత్త గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలి
డైలీ భారత్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: కొత్త సర్పంచ్లు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల మన్ననలు పొందాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో గెలుపొందిన కొత్త గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల వరకు రాజకీయాలు కొనసాగాలని, గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, బాధ్యతగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. రెండేండ్లుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కొత్త పాలకవర్గాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ప్రధానంగా తాగు నీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, చెత్త సేకరణ తొలి ప్రాధాన్యతగా భావించి పనులు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కేటాయించిన మాదిరిగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సైతం నిధులు కేటాయించి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలన్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుతో కలిసికట్టుగా గ్రామస్తులను కలుపుకొనిపోయి అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా జరిగినందుకు పార్టీ శ్రేణులకు, ప్రజలకు, అధికారులకు, పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >