| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం- 17 మంది సజీవదహనం

News

Posted on 2025-12-25 10:55:17

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం- 17 మంది సజీవదహనం

డైలీ భారత్ న్యూస్, కర్నాటక:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మందికి ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సీబర్డ్ ట్రావెల్స్ కు చెందిన ఈ స్లీపర్ కోచ్ బస్సు అది. 30 మంది ప్రయాణికులతో బుధవారం 8:25 గంటలకు బెంగళూరులోని గాంధీనగర్ నుంచి గోకర్ణకు బస్సు బయలుదేరింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 25 మంది గోకర్ణ, ఇద్దరు శివమొగ్గ, ఇద్దరు కుమటాకు చేరుకోవాల్సి ఉంది. వేకువజామున సుమారు 2:45 నిమిషాల ప్రాంతంలో చిత్రదుర్గ జిల్లాలో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 48పై హిరియూర్ సమీపంలోని జవనగొండనహళ్లి-గోరట్లు క్రాస్ వద్ద అదుపు తప్పింది. ఓ భారీ కంటైనర్ ను అతివేగంగా ఢీ కొట్టింది.

ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఢీకొన్న తీవ్రతకు క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. కంటైనర్ సైతం మంటలబారిన పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉండటంతో బయటపడే అవకాశమే వారికి లభించలేదు.

అకస్మాత్తుగా చెలరేగిన మంటల నుండి 10 మంది కాలిన గాయాలతో కిటికీ అద్దాలను పగులగొట్టి బయటికి రాగలిగారు. మంటల ఉధృతికి బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్రంగా శ్రమించారు.

గాయపడిన ప్రయాణికులను తక్షణమే అంబులెన్స్‌ల సాయంతో చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటన కారణంగా జాతీయ రహదారి 48పై జవనగొండనహళ్లి వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శిరా మరియు హిరియూర్ మధ్య సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >