Posted on 2025-12-25 20:26:08
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ శీతకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2025, డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు గవర్నర్ ఆమోదంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు బుధవారం (డిసెంబర్ 24) నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన తర్వాత సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.ఈ సెషన్లో కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళిక గురించి హౌస్‌లో డిస్కస్ చేయనున్నట్లు సమాచారం.ఓ వైపు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం.. మరోవైపు ఆయనకు కౌంటర్‌గా అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో ఈ సెషన్‌పై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న అపొజిషన్ లీడర్ కేసీఆర్.. ఈ సారైనా అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. సభలో అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం శీతకాలంలో సెగలు రేపనుంది.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >