Posted on 2025-12-25 22:02:33
డిసెంబర్ 26 నుంచి సోసైటి కార్యాలయాలు వద్ద రైతులు నిరసన
రైతు సంఘం జిల్లా సమావేశంలో కార్యదర్శి బొంతు రాంబాబు
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లా ప్రాధమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంస్థలకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేసి పాలకమండల్లను నియమించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిసెంబర్ 26 నుంచి సోసైటి కార్యాలయాలు వద్ద రైతులు నిరసన జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం లో రాంబాబు మాట్లాడుతూ రైతులు సమిష్టి గా నిర్వహించే సోసైటి ల పాలకమండలి ఇప్పటి వరకు రైతు సభ్యులు తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎంపిక జరుగుతుంది అని నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను నామినేట్ చేసి సహాకార వ్యవస్ధను ధ్వంసం చేయుటకు ప్రయాత్నాలు చేయడం అప్రజాస్వామికం అన్నారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు చేటు చేస్తుందని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల సర్కులర్ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని అన్నారు, రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ 63 కోట్ల ఖమ్మం జిల్లా రైతులకు అందించాలని కోరారు, మిర్చి రైతులకు పరిహారం అందించాలి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కర్ రావు, ఎస్ కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్, దుగ్గి కృష్ణ,సహాయ కార్యదర్శులు గొడవర్తి నాగేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, బోడేపూడి వీరభద్రం,కోల్లెటి ఉపేందర్, కూచిపూడి మధు, బింగి రమేష్, వజ్జా రామారావు, అన్నా సాగరం సర్పంచ్ బొడ్డు రాంబాబు,కిలారు సురేష్ తదితరులు పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >