Posted on 2025-12-26 07:24:59
అత్యంత చలి, ఈదురు గాలులతో వణికి పోతున్న జనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలతో రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రెండు రోజులు గా మరి అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వనికి పోతున్నారు. ముఖ్యంగా హృద్రోహులు, వృద్దులు, మహిళలు, చిన్నపిల్లలు చలి ప్రతాపానికి బయటకి ఉదయం 11 అయినా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం ఐదు నుండి మరునాడు ఉదయం 11, 12 గంటల వరకు చలి పూర్తిస్థాయిలో పోవడం లేదు. అయితే వివిధ పనుల నిమిత్తం ఉద్యోగాల కోసం వెళ్లేవారు గత్యంతరం లేని పరిస్థితుల్లో చలిని సైతం లెక్కచేయకుండా విధుల్లోకి హాజరవుతున్నారు. గతంలో ఇలాంటి ఈ విధంగా చలి ఏనాడు చూడలేమని వృద్ధులు పేర్కొంటున్నారు. తాజాగా గురువారం రాత్రి నుండి 13 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం చలి తీవ్రత విపరీతంగా ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం సాయంత్రంk వేళలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు వైద్యులు మాత్రం గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, నిమోనియా లాంటి లక్షణాలున్న చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుందని వారు వివరిస్తున్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >