Posted on 2025-12-26 13:02:09
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా మంది ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు. లైకులు, వ్యూవ్స్ కోసం ఒళ్లు చూపిస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు చూస్తే చెడిపోతారు అని ఆలోచించకుండా అసభ్యకర కంటెట్ క్రియేట్ చేస్తున్నారు. లైక్స్ షేర్స్ పెరిగిన తరవాత వస్తువులను, ప్రోడక్టులను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎక్స్ పోజింగ్ చేయడం, డబుల్ మీనింగ్ పదాలు మరియు బూతులు మాట్లాడటం అనేది సైబర్ క్రైమ్ కిందకి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కానీ ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో అయినా అసభ్యకర వీడియోలు చేయడం కానీ లేదా షేర్ చేసినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేసిన మెహక్, పరి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసినందుకు 296b of bns and it చట్టాల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సెక్షన్ 67 ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ అవయవాలను చూపిస్తూ ఎదుటివారిలో కోరికలు రగిలించి రెచ్చగొట్టేలా చేయడం, చెడగొట్టేలా కంటెంట్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. మొదటిసారి అలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.5లక్షల ఫైన్ ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రెండేసారి కూడా అలాంటి తప్పే చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష రూ.10లక్షల ఫైన్ విధించే అవకాశం ఉందని చెబుతున్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >