Posted on 2026-01-08 18:24:58
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: వికసిత్ భారత్.. వికసిత్ గ్రామాల ఏర్పాటే లక్ష్యంగా దేశంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ అభివృద్ధి కోసం విప్లవాత్మక మార్పు చట్టం అమల్లోకి తీసుకువచ్చారని భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన "వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ అజీవిక మిషన్" నూతన చట్టం గ్రామీణ అభివృద్ధిలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు.
ఈ చట్టం వల్ల గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమే అని ఆయన అన్నారు.
పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే వారికి "నిరుద్యోగ భృతి" చెల్లించే నిబంధనను ఈ చట్టంలో మరింత బలోపేతం చేశారు.
గతంలో వేతనాల చెల్లింపులో జాప్యం జరిగేది, కానీ ఇప్పుడు ప్రతి వారం నేరుగా కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేయడం జరుగుతుందన్నారు.
ఒకవేళ వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోతే, అదనపు పరిహారం చెల్లించే వెసులుబాటును కూడా ఈ చట్టంలో చేర్చారు.
వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా, విత్తులు, నాట్లు మరియు పంటకోత సమయాల్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు.
గ్రామ పంచాయతీ, గ్రామసభలే స్వయంగా తమ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పనులు విపత్తు నిర్వహణ వంటి నాలుగు రకాల పనులు చేపట్టనున్నారు. ఇందులో చెరువులు, చెక్ డ్యామ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలతో పాటు, మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయాన్ని పెంచే పనులను కూడా చేర్చారన్నారు.
ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాయకులు ప్రమోద్, జ్యోతి, బద్దం కిసాన్, వీరేందర్, ఓం సింగ్, ఇప్పకాయల కిషోర్, తారక్ వేణు, మాస్టర్ శంకర్, బుర్గుల వినోద్, ఆమందు విజయ్ కృష్ణ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >