Posted on 2026-01-11 22:07:32
ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా
మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: ఐకమత్యంతో ఉండి మున్నూరు కాపులా సత్తా ఏంటో రాజకీయంగా ఆర్థికంగా చాటి చెప్పుదామని మాజీ మేయర్, మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. ఆదివారం మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ నగర్ నుంచి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఉద్దేశించి ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ..
మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని, ఏ కష్టం వచ్చినా జిల్లా కేంద్రంలో నేనున్నానని మర్చిపోవద్దన్నారు. రాజకీయంగా ఎదుగుదలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ సింహాలు ఉన్నాయని, ఏ విషయంలోనైనా అండగా ఉంటానన్నారు.
జిల్లాలో 450 పైచిలుకు సర్పంచ్, సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలవడం గొప్ప విషయమని, ఇంతమందిని ఒకే వేదికపై సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ కండువాలు ఒకటి ఒకటి ముడివేస్తే నిజామాబాద్ జిల్లాను రావచ్చన్నారు. రాబోవు రోజుల్లో మున్నూరు కాపులతో బ్రహ్మాండంగా సభ నిర్వహించనున్నామని చెప్పకనే చెప్పారు. సన్మాన కార్యక్రమం కోసం ఎంతోమంది శ్రమ దాగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మీ అందరిని ఇలా చూస్తుంటే ఆనాడు ధర్మపురి శ్రీనివాస్ గుర్తొస్తున్నారన్నారు. ఆయన సంఘానికి ఎంతో సేవ చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, గ్రామ మండల, స్థాయిలలో మున్నూరు కాపులు ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రేలాలే రేల గంగా పాడిన మున్నూరు కాపులము..పాటకు ధర్మపురి సంజయ్ కండువా ఊపి డ్యాన్స్ చేశారు. దీంతో స్టేజ్ మీద ఉన్న అందరూ, కింద ఉన్న వాళ్ళు కండువా ఊపుతూ పాటకు ఊపు తెచ్చారు.
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >