Posted on 2026-01-12 22:53:57
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ పరిధిలో దొంగ నోటు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని ఒక వ్యక్తి రూ.500 విలువైన నోటుతో పాన్ షాప్‌కు వచ్చాడు. ఆ నోటు అనుమానాస్పదంగా కనిపించడంతో షాప్ యజమాని జాగ్రత్తగా పరిశీలించాడు.
పరిశీలనలో ఆ రూ.500 నోటు దొంగ నోటుగా గుర్తించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో వ్యాపారులు, సామాన్య ప్రజలు నోట్ల లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు ఎదురైతే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదా 100కి డయల్ చేస్తామని అన్నారు దొంగ నోట్ల చలామణి ప్రజల ఆర్థిక భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు అక్రమాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి తెలియజేసినారు
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >