| Daily భారత్
Logo




సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2026-01-15 20:16:20

Share: Share


సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని వినాయక నగర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగురంగుల సంక్రాంతి సంబురాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువతతో కలిసి గాలిపటం ఎగరవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రైతుల పండుగగా, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే మహత్తర పండుగగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు, ఆచారాలు కొనసాగాలంటే ఇలాంటి వేడుకలు ప్రతి కాలనీలో జరగాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మొబైల్ సంస్కృతికి పరిమితం కాకుండా, మన పండుగల ప్రాముఖ్యతను గుర్తించి సంస్కృతిని కాపాడాలని సూచించారు. వినాయక నగర్ వాసులు ఐక్యంగా పండుగను జరుపుకోవడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. నగరాన్ని అభివృద్ధితో పాటు సంప్రదాయాలకు నిలయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >