Posted on 2026-01-16 18:12:26
డైలీ భారత్, వరంగల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో 3.90 కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నవి 63.19 లక్షల నగదు, బ్యాంక్లో 1 లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో: 1. పసునూరి బసవ రాజు, వయసు: 32 సంవత్సరాలు యాదాద్రి జిల్లా. 2. జెల్లా పాండ, వయసు: 46 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 3.మహేశ్వరం గణేష్ కుమార్, వయసు: 39 సంవత్సరాలు యాదాద్రి జిల్లా. 4. ఈగజులపాటి శ్రీనాథ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ. 5. యెనగంధుల వెంకటేష్, జనగామ. 6. కోదురి శ్రావణ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ. 7. కొలిపాక సతీష్ కుమార్ వయసు: 36 సంవత్సరాలు, కొడకండ్ల (ఎం), జనగామ. 8. తడూరి రంజిత్ కుమార్ వయసు 39 సంవత్సరాలు, నర్మెట్ట, జనగామ. 9. దుంపల కిషన్ రెడ్డి, వయసు: 29 సంవత్సరాలు, ఆత్మకూర్ (ఎం), యాదాద్రి జిల్లా, 10. దశరథ మేఘావత్ వయసు: 28 సంవత్సరాలుతురుపల్లి. 11. నారా భాను ప్రసాద్, వయసు: 30 సంవత్సరాలు, యాదగిరిగుట్ట, 12. గొపగాను శ్రీనాథ్, వయసు: 32 సంవత్సరాలు, శివ కుమార్, వయస్సు 33, అమంగల్, నల్లగొండ. 15. అలేటి నాగరాజు, వయస్సు 32, యాదాద్రి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
యాదాద్రి జిల్లా, 13. ఒగ్గు కర్నాకర్, వయసు: 42 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 14. కమల్ల
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS వివరాలను వెల్లడిస్తూ ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్లలో ఆన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు, ఇందులో నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను ఆన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకొని చేల్లించాల్సిన మొత్తాన్ని ఏన్.ఆర్.ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి అట్టి వసూలు చేసిన డబ్బు నుండి ఆన్లైన్ సర్వీస్ వ్యక్తులకు మరియు మద్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఇ చాలాన్ లను ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు అట్టి ధరణీ/భూభారతీ వెబ్సైట్లో ఇన్స్స్పెక్ట్ " ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చాలన్ రుసుము తగ్గించేవాడు. అనంతరం అట్టి ఛలాన్ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు.
ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ను ఉపయోగించి నిందితులు ప్రభుత్వానికి చెల్లించిన రుసుము కు సంబంధించి వెబ్సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసి అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించిన నకిలీ చలాన్లను స్థానిక యం.ఆర్.ఓ/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొదుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడి కావున జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూ భారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్ సైట్లో నమోదు చేసేవారు. ఇందుగాను ప్రధాన నిందితులు మిగితా వారికి పది శాతం నుండి 30శాతం వరకు కమిషన్ చెల్లించేవారు.
ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావా దేవిల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందులో జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ఈ ముఠా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏ.ఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారయణ రెడ్డి, రఘునాథపల్లి సర్కిల్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఇతర ఎస్.ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >