| Daily భారత్
Logo




ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా వానర సైన్యం స్వైర విహారం

News

Posted on 2026-01-16 19:08:48

Share: Share


ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా వానర సైన్యం స్వైర విహారం

భయాందోళనలకు గురవుతున్న ప్రజలు

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతులు అడవులను వదిలి జన సంద్రాలోకి వచ్చి ఇండ్లలోకి గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాటు, ఆర్మూర్, వర్ని మండలాలతో పాటు పలు గ్రామాలలో వానర సైన్యం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా బయట తిరగాలంటేనే కోతులు ఎక్కడ మీద పడి గాయపరుస్తాయోనని భయంతో జీవిస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో కోతులు గుంపులుగా చేరి వీరవిహారం చేస్తున్నాయి. విపరీతంగా కొట్లాడుకుంటూ రోడ్లపైకి వస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇళ్లపైకి దూకుతూ నిత్యావసరాలను ఎత్తుకెళ్తున్నాయని, బాటసారులపై దాడులకు దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కోతుల బెడదతో నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నామని, ఇప్పటికైనా అటవీ శాఖ  అధికారులు స్పందించి వాటిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >