| Daily భారత్
Logo




వరంగల్ మద్యం షాపులలో కాలం చెల్లిన బీర్లు అమ్మకాలు

News

Posted on 2023-09-15 18:10:48

Share: Share


వరంగల్ మద్యం షాపులలో కాలం చెల్లిన బీర్లు అమ్మకాలు

డైలీ భారత్, వరంగల్ జిల్లా :వరంగల్ మహానగరంలో కాలం చెల్లిన బీర్లు విక్రయిస్తున్న సమాచారం మేరకు  వైన్ షాప్స్ పై  వరంగల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన అయిదు టీమ్స్ శుక్రవారం మెరుపు దాడులు చేశాయి.

ఈ దాడుల్లో నాలుగు వైన్ షాపుల నుండి 2 లక్షల విలువ గల  కాలం చెల్లిన బీరు బాటిల్స్ నిల్వలను సీజ్ చేశారు.

కాలం తీరిన బీర్ల విక్రయాల బాగోతంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అలిగేటి మధుసూదన్ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.

వేసవి కాలంలో బీర్లకు డిమాండ్ ఉంటుందని వైన్ షాప్ యజమానులు ఐ ఎం ఎఫ్ ఎల్ నుండి పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టి బీర్లను నిల్వ చేసుకొన్నారు. కానీ వైన్ షాప్ యజమానులు ఆశించిన రీతిలో బీర్ల సేల్స్ కాలేదు. అదీగాక బీర్లు విక్రయించేందుకు ఉన్న కాల పరిమితి ముగిసింది.

కాలం చెల్లిన బీర్లను సదరు కంపెనీలకు వాపస్ పంపడమో లేదా ఎక్స్ ఫైరీ డేట్ ముగిసిన బీర్లను ధ్వంసం చేయాల్సి ఉంది. కానీ వైన్ షాప్ యజమానులు ఆర్ధికంగా నష్టపోవడానికి ఇష్టపడక గుట్టుగా వినియోగదారులను మోసం చేసే స్కెచ్ వేసి అమలు పర్చారు.

పెట్టుబడులను నష్ట పోకుండ ఉండేందుకు బీర్లపై ముద్రించిన ఎక్స్ ఫైరీ డేట్స్ కనిపించకుండా ఉండే విధంగా కంప్యూటర్ ద్వారా స్టికర్స్ తయారీ చేసి,బీర్లపై అంటించి దర్జాగా విక్రయిస్తున్నారు.

తయారీ తేదీ నుండి నిర్ణీత కాల పరిమితి లోగా విక్రయాలు జరుపుకోలేక మందుబాబుల వద్ద ఎం ఆర్ పి ధరల ప్రకారం విక్రయిస్తూ వారి ప్రాణాలతో చేలాగాటమాడుతున్నారు. ఈ విషయంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందుకున్నారు.

వరంగల్ ట్రై సిటీలోని పార్క్ లైన్ వైన్స్ షాప్స్ లో జోరుగా,బహిరంగంగా కాలం చెల్లిన బీర్ల దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

టాస్క్ ఫోర్స్ కు చెందిన ఐదుగురు ఇన్స్ పెక్టర్ల నేతృత్వంలో శుక్రవారం దాడులు చేశారు. బ్రో కంపెనీ బీర్ల కాల పరిమితి గడువు ఈ ఏడాది మే 10వ, తేదీతో ముగిసింది. ఎక్స్ ఫైరీ డేట్స్ కనిపించకుండా స్టిక్కర్స్ వేసి బీరు ప్రియులను మోసం చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో బట్టబయలైంది.

సుబేధారి ఫారెస్ట్ ఆఫీస్ వద్ద గల  వైన్స్, కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు లోగల వైన్స్  హన్మకొండ పెద్దమ్మగడ్డ లోని వైన్స్, వరంగల్ లోని గోపాలస్వామి గుడి వద్ద గల వైన్స్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు........

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >