Posted on 2026-01-19 16:51:50
రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ పేలుడు పదార్థాల కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ , భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం.
జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ వెల్లడి
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, నిల్వ, రవాణా మరియు అమ్మకం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తేదీ18.01.2026 నాడు ఉదయం10:30 గంటల సమయంలో, రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పి. రాజశేఖర్గారు రామారెడ్డి రథాల గైని ప్రాంతంలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, గర్గుల్ గ్రామం వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని గమనించారు. పోలీసులను చూసి వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని వెంబడించి పట్టుకొని విచారించగా వారు ఎటువంటి అనుమతులు లేకుండా జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు మరియు వైరులను నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామానికి చెందిన వరికుప్పల నర్సింలు నుండి కొనుగోలు చ గాంధారి మండలంలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండ రాళ్లను పేల్చేందుకు తరలిస్తున్నట్టు తెలిసినది. వీరు గతములో కామారెడ్డి మరియు పరిసర ప్రాంతాలలో కూడా ఇలా పేలుడు పదార్థాలు ఉపయోగించి బండరాళ్లను పగులగొట్టినారు. ఇట్టి విషయములో Cr. No. 09/2026U/Sec 288 BNS, 9(B)(1)(b) & 9(B)(1)(b)(c) Explosive Actand Sec 4 & 5 Explosive substance Act కింద రామారెడ్డి పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేయబడినది.
నేరస్తుల వివరములు
A1: రాజు S/o ఎల్లయ్య, వయస్సు: 42 సంవత్సరాలు, కులము:ఒడ్డెర, వృత్తి:రాయి కొట్టే కూలీ (Stone Cutter), నివాసం:గర్గుల్ గ్రామం, కామారెడ్డి మండలం
A2: శేషు లాల్ S/o కేజిరామ్, వయసు 55 సంవత్సరాలు, కులము:ఆదివాసి, వృత్తి:కూలీ, నివాసం:పనర్వాణి గ్రామం, మౌలమవ్‌పూర్ చౌకి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం
స్వాధీనపు వివరములు
A1 వద్ద నుంచి:
50 జెలటిన్ స్టిక్స్
హోండా షైన్ ద్విచక్ర వాహనం (TS16 EM 7607)
ఒక ఐఫోన్ మొబైల్ ఫోన్
A2 వద్ద నుంచి:
6 డిటోనేటర్లు
సుమారు 52 మీటర్ల వైరు
ఒక జియోభారత్ కీప్యాడ్ మొబైల్ ఫోన్
స్వాధీనం చేసుకున్నారు.
పై ఇద్దరు నేరస్తుల సమాచారముతో పోలీసులు నందిపేట్ గ్రామానికి వెళ్లి A3: వరికుప్పల నర్సింలు S/o వెంకయ్య, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: ఒడ్డెర, Occp: కుల వృత్తి (స్టోన్ కట్టర్), N/o కొండగడప గ్రామం మోత్కూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు నందిపేట్ గ్రామం మరియు మండలం, నిజామాబాద్ జిల్లా వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను అక్రమంగా పేలుడు పదార్థాలను ఎలాంటి లైసెన్సులు లేని వ్యక్తులకు కూడా అధిక ధరలకు అమ్ముతున్నాడు
A3 వద్ద నుంచి:
• 20 జెలటిన్ స్టిక్స్
• 4 డిటోనేటర్లు
• సుమారు 5 మీటర్ల వైరు
• ఒక ఒప్పో మొబైల్ ఫోన్
• రెండు రిజిస్టర్స్
ఈ విచారణలో పేలుడు పదార్థాల లైసెన్స్ ఉన్న A4: ఓరుసు సాయి మల్లు @ మల్లేష్, మాచర్ల గ్రామం, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా. ఇతను ఈ పూర్తి అక్రమ వ్యవహారములో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
అక్రమంగా పేలుడు పదార్థాల వినియోగం వలన ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలిగుతుందని తెలిసి కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యస్ పి గారు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.
ఇట్టి కేసులో చాకచక్యముగా వ్యవహరించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ. S.రామన్, రామారెడ్డి SIP. రాజశేకర్ , మాచారెడ్డి SI అనిల్, PCs మహేందర్, సిద్దారాములు మరియు HG కైలాష్ ను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >