Posted on 2026-01-20 17:11:40
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షునిగా అనంతారం గ్రామానికి చెందిన యువ నేత ఉసికల రమేష్ ఎన్నికయ్యారు. హైదరాబాద్, కూకట్ పల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇటీవల జరిగిన పార్టీ ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీగా జనసైనికులు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా జన సైనికులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నియోజకవర్గ కమిటీ నియామకాలను మిరియాల రామకృష్ణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ కమిటీ నియామకాలను వేముల కార్తీక్ కు అప్పజెప్పారు. ఇందులో భాగంగా జూలూరుపాడు మండల జనసేన అధ్యక్షుడిగా ఉసికల రమేష్ ను ఎన్నుకున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మాట్లాడుతూ పార్టీ పోటీ చేసిన దగ్గర గెలుపు కోసం ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడుగా ఎన్నికైన ఉసికల రమేష్ మాట్లాడుతూ పార్టీలో ఈ బాధ్యతలను అప్పగించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్, ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ కట్ల రామకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నడుచుకుంటూ, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >