Posted on 2026-01-20 17:17:56
డైలీ భారత్, దమ్మపేట: దమ్మపేట మండల కేంద్రంలోని శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో, ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణన్ని సర్వంగా సుందరం గా అలంకరించారు
ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకలు నిర్వహించగా, అనంతరం ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం ఉదయం 8 గంటలకు నుంచి ఆలయ ప్రాంగణంలో 102 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.వాసవి మాత మూల విరాట్ కు పోకూరి వెంకట సుబ్బారావు జ్ఞాపకర్థం కుమారులు పోకూరి కృష్ణ ప్రసాద్, మల్లికార్జున గుప్తా లు లక్ష రూపాయల విలువైన వెండి కిరీటం మరియు వెండి వస్తువులు ఆలయ కమిటీ కీ అందజేశారుఅనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో మండల మరియు టౌన్ అధ్యక్షులు పసుమర్తి రాంభద్రం, ధారా ప్రసాద్, పైడి వెంకటేశ్వరరావు, ధారా యుగంధర్, దారా మల్లికార్జున రావు, లక్ష్మి నారాయణ,ప్రదీప్, పోసి, వినోద్, సురేష్, కొలిశెట్టి ప్రదీప్ జగదీష్, పుల్లారావు, సాయిరాం, వెంకటేశ్వరరావు, దారా తాత రావు తదితరులు పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >